యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్‌లో కుక్కలు వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరూ తీసుకెళ్లకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్‌కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు. ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి. వీధుల్లో వదలకూడదు.