దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్ 360 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించాయి. ఉదయం 82,404.54 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, చివరికి 368.07 పాయింట్లు తగ్గి 81,958.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,122.75 వద్ద ముగిసింది. టాటా మోటర్స్, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు నష్టపోగా, విప్రో, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటివి లాభాల్లో ముగిశాయి.