టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ - 2025లో భాగంగా ఆదివారం మ్యాచ్‌లో విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ జట్టుపై సెటైర్లు వేశారు. పాక్ జట్టును ప్రత్యర్థిగా చూడకూడదని పేర్కొన్నారు. “పాకిస్థాన్ జట్టు భారత్‌కు ఎప్పటికీ ప్రత్యర్థి కాదు. రెండు జట్లు 15 మ్యాచ్‌లు ఆడితే విజయాలు 8–7గా ఉన్నప్పుడు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవాలి. కానీ, ఒకటో, రెండో మ్యాచ్‌లు గెలిచే జట్టు ప్రత్యర్థి ఎలా అవుతుంది” అని ఆయన విమర్శించారు.