ఎక్కడా రాజీ ప‌డొద్దు: మంత్రి కొండా సురేఖ

TG: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలకు సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని, లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. రూ.50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో రాజీ పడకుండా చూడాలని, మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన స్థల సేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్