కారు యజమానులు తమ వాహనాల్లో పెట్రోల్/డీజిల్ నింపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపడం వల్ల ఇంధన ప్రవాహం సరిగా ఉండకపోవడం, ఇంజిన్ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేయడం కూడా ఇంజిన్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించేలా చేస్తుంది. పెట్రోల్ బంకులో ఆటో-కట్ రాగానే ఆపేయడం మంచిది. ఇంధనం నింపేటప్పుడు ఇంజిన్ ఆపి, పంప్ గొట్టం ట్యాంక్‌లోకి సరిగ్గా వెళ్లేలా చూడాలి.