టీ తాగేముందు ఒక గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నేరుగా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, అసిడిటీ, జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే టీ తాగే ముందు నీరు తాగడం వల్ల శరీరంలోని ఆమ్లం పలుచబడి, టీలో ఉండే కెఫిన్ ప్రభావం తగ్గి కడుపు చికాకు తగ్గుతుంది. ముఖ్యంగా అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించడం మంచిది.