రాజస్థాన్‌లో బస్సులోనే డ్రైవర్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇండోర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ సతీష్ రావు (36) డ్రైవింగ్ సమయంలో అనారోగ్యానికి గురై, ముందు జాగ్రత్తగా కో-డ్రైవర్‌కు స్టీరింగ్ అప్పగించాడు. అనంతరం బస్సులోనే కుప్పకూలి మరణించాడు. అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.