రాజస్థాన్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం అతడిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. భారీ వర్షాల కారణంగా బన్స్‌వారా గ్రామంలో కల్వర్టు పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ కారు డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కారు వరద ప్రవాహంలో చిక్కుకుంది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై డ్రైవర్‌ను రక్షించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కారు ప్రవాహంలో కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది.