దేవీ నవరాత్రులలో రెండవ రోజు, ఆశ్వయుజ శుక్ల తదియ నాడు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆదిశంకరాచార్యులు ఆరాధించిన ఈ దేవిని దర్శించడం వల్ల మనసు పులకితమవుతుందని, సిరి సంపదలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తున్నారు. గాయత్రీ దేవి పంచముఖాలు పంచభూతాలకు ప్రతీక. ఈ రోజు గాయత్రీ కవచం చదవడం అత్యంత ఫలవంతం. అమ్మవారికి తామర లేదా కలువ పువ్వులను సమర్పించి, చలిమిడి, వడపప్పు, పానకం, కొబ్బరి అన్నం, అల్లపు గారెలను నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతారని భక్తుల నమ్మకం.