ఇకపై ఆధార్ కార్డులో అప్‌డేట్స్ కోసం ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాలకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం త్వరలో eAadhaar Appను తీసుకొస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల డిజిటల్ ఆధార్ సేవలు సురక్షితంగా ఉంటాయని కేంద్రం చెబుతోంది. నవంబర్ నెలలో ఈ యాప్ లాంచ్ చేసే అవకాశం ఉంది.