రాత్రి భోజనం చేసిన తరువాత యాలకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు యాలకులు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. రక్తపోటు సమస్యలు, బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన నుంచి యాలకుల వల్ల విముక్తి లభిస్తుంది. ఇవి గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.