దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ఈసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 నాటికి ఎస్‌ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం అక్టోబర్, నవంబర్‌ల్లో దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బిహార్‌లో ఎస్‌ఐఆర్ అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.