దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్ కేసులో మరోసారి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, రియల్ హీరోగా పేరొందిన నటుడు సోనూసూద్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. 1xBet యాప్ ప్రచారానికి సంబంధించి సమన్లు పంపిన ఈడీ, ఆయనను ఈ నెల 24న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.