నాలాలు, చెరువుల కబ్జాలను తొలగించాల్సిందే: CM రేవంత్

TG: వరంగల్‌లో నాలాలు, చెరువుల కబ్జాలను తొలగించాల్సిందేనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. WGL, హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం పరిస్థితిపై సమీక్షించారు. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కలెక్టర్లు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని అన్నారు. ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇండ్లు, పంటలు, పశువుల నష్టంపై పూర్తి నివేదిక కావాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్