ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన పదిహేనేళ్ల సుదర్ఘీ కెరీర్‌కు సోమవారం అల్విదా చెప్పేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందే గాయం నుంచి కోలుకున్న వోక్స్ … మరోసారి గాయపడడంతో కెరీర్ ప్రమాదంలో పడింది. ఓవల్ టెస్టులో ఎడమ భుజం పక్కకు జరగడంతో యాషెస్ సిరీస్‌లో ఆడాలనుకున్న అతడి కల చెదిరింది. దాంతోగాయాలతో వేగలేకనే ఆటకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.