కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపుల కారణంగా ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల సకాలంలో స్పందనతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మహిళా కానిస్టేబుల్ కుటుంబసభ్యులు కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. వారికి ఇతర కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ కూడా మద్దతు తెలిపారు. సిబ్బంది మధ్య గొడవలు సృష్టించి, వేధింపులకు పాల్పడుతున్నారని ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు.