ఒక్క ఇంజెక్షన్‌తో క్యాన్సర్ నయమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2141.V11 అనే సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ మందును తొలిసారిగా మనుషులపై పరీక్షించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయి. రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని ఇతర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్ రోగులపై పరీక్షించారు. 12 మందిలో 6 మందికి కణితులు చిన్నవయ్యాయి. ముఖ్యంగా రక్త, రొమ్ము క్యాన్సర్ ఉన్న ఇద్దరిలో పూర్తిగా నయమయ్యాయి. ఒక్క కణితి వద్దే కాకుండా శరీరమంతా ప్రభావం చూపడం అరుదైన విషయం అని పరిశోధకులు తెలిపారు.