రాజస్థాన్‌లోని జైపుర్-అజ్మేర్ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రహదారి అంతా మంటలతో అల్లకల్లోలంగా మారింది. సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.