పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్

తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న ఐ బొమ్మ (I Bomma) పైరసీ వెబ్‌సైట్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తెలుగు చిత్ర నిర్మాతలు, హీరోలను బెదిరిస్తున్న ఈ వెబ్‌సైట్ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది. ఐ బొమ్మ వంటి వెబ్‌సైట్‌లను ఎంత సాంకేతిక పరిజ్ఞానంతో దాక్కున్నా, అంతర్జాతీయ సహకారంతో వారి మూలాలను ఛేదిస్తామని సీపీ హెచ్చరించారు. దీనిపై ఐ బొమ్మ స్పందిస్తూ, 'మీరు మాపై ఫోకస్ చేస్తే, మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది' అని లేఖ విడుదల చేసింది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్