మార్కెట్లో నకిలీ మందులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రకాల మందులపై క్యూఆర్ కోడ్ విధిస్తూ ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. క్యూఆర్ లేదా బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే మందు అసలైనదా, నకిలీదా అనే విషయం తెలుసుకోవచ్చు. స్కాన్‌లో యూనిక్ ప్రొడక్ట్ ఐడీ, బ్రాండ్, తయారీ స్థానం, బ్యాచ్ నంబర్, తేది వంటి వివరాలు చూపబడతాయి. ఒకవేళ ఇవేం చూపించకపోతే ఆ ఔషధాన్ని నకిలీగా పరిగణించాలి.