AP: పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో టమాటా, ఉల్లి రైతులు తమ పంటలను పారబోసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వమే ఉల్లి, టమాటాను కొనుగోలు చేసి, విక్రయించాలి. కోల్డ్ స్టోరేజీల్లో పంటను నిల్వ చేసి, ధర ఉన్నప్పుడు విక్రయిస్తే రైతులకు మేలు చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రైతులను ఆదుకునేందుకు నిధులు కేటాయిస్తున్నామని చెబుతోంది. కానీ ఆచరణలో రైతులకు ఎటువంటి మద్దతు లభించడం లేదు.