TG: ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మాదన్నపేటలో జరిగింది. తన ఇంటి ముందు పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో కానిస్టేబుల్ తన భార్య, సోదరిని పిలిచి వృద్ధురాలిపై దాడి చేయించినట్లుగా తెలుస్తోంది. 60 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ, కర్రతో దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.