రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన 'కాంతార' సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వస్తోంది. ఇటీవల సినిమా చూసిన ఓ పూజారికి థియేటర్ బయట పూనకాలు రాగా, తాజాగా తమిళనాడులోని దిండిగల్‌లో ఓ అభిమాని పంజుర్లి దేవుడి వేషధారణలో థియేటర్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.