ఈ హైవేలపై ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లదు!

ఫాస్టాగ్ వార్షిక పాస్ పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. అయితే ఫాస్టాగ్ పాస్ అన్ని రహదారుల్లో చెల్లుబాటు కాదని తెలుసా? కేంద్రం పరిధిలోని హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేస్‌లోని టోల్ ప్లాజాల వద్దే వార్షిక పాస్‌తో చెల్లింపులను అనుమతిస్తారు. మిగతా చోట్ల సాధారణ ఫాస్టాగ్‌తో టోల్ చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రోడ్లపై వార్షిక పాస్‌తో చెల్లింపులు సాధ్యం కాదు. యమునా ఎక్స్‌ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే పై కూడా చెల్లబాటు కాదు.

సంబంధిత పోస్ట్