ఆఫ్రికాలోని కాంగోలో బుధవారం రాత్రి ఘోర పడవ ప్రమాదం సంభవించింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల పడవ బోల్తా పడి 86 మంది మరణించినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాంగోలో రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తరచుగా పడవ ప్రయాణాలను ఆశ్రయిస్తుంటారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.