ఘోర ప్రమాదం.. 16 మంది ఏపీ వాసులకు తీవ్ర గాయాలు

యూపీలోని జౌన్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రికులు వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు బాధితులను ఫోన్ ద్వారా పరామర్శించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్