ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంగుల్ జిల్లాలో ఖండ హట వంతెన సమీపంలో ఆటో రిక్షాను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ముగ్గురు స్పాట్‌లోనే మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. మృతులను బన్షిధర సేథి, ఆయన భార్య కమలా సేథి, ఆటో రిక్షా డ్రైవర్ మంతు ముదులిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్