అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లూయిస్వీలె మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. దాంతో విమానం పేలిపోయి పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.