యూపీలోని ఆగ్రాలో ట్రై జంక్షన్ వద్ద మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓవర్ లోడ్ ట్రక్కు బైక్‌ను ఢీకొనడంతో భార్యాభర్తలు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామ్ సేవక్ (40), అనితా దేవి (35), కుమార్తె డాలీ (10)గా గుర్తించారు. అనిత నాలుగు నెలల గర్భవతి అని, ట్రక్కు బైక్‌ను దాదాపు 600 మీటర్లు లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.