ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి(వీడియో)

యూపీలోని ఉన్నావ్ జిల్లా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా నుండి లక్నోకు వెళ్తున్న ఓ కారు.. ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి మరొక లైన్‌లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ క్రమంలో రోడ్డుపై పనిచేస్తున్న యుపిడిఏ ఉద్యోగులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బెహ్తా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్