దీపావళి పండుగకు తుపాకులు పేల్చిన తండ్రీకొడుకులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ రోజున, అందరూ బాణసంచా కాలుస్తుంటే.. ముకేశ్ కుమార్ (42) అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి తుపాకులు పేల్చి సంబరాలు చేసుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అక్టోబర్ 30న యాంటీ నార్కోటిక్ సెల్ దృష్టికి ఈ విషయం రావడంతో, వారిని శాస్త్రినగర్‌లోని వారి స్వీట్ల దుకాణం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్