పిల్లల గొడవలో తలదూర్చి తండ్రి మృతి (VIDEO)

TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని అవుషాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన సయ్యద్ అలీ, సయ్యద్ అమీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అమీర్ తీవ్ర ఆగ్రహంతో ఘర్షణకు దిగాడు. కొద్దిసేపటికే అతనికి ఛాతినొప్పి, వాంతులు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన సయ్యద్ అలీ స్వయంగా పోలీసుల వద్ద లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్