TG: భార్యభర్తల మధ్య విభేదాలు ఏడాది వయసున్న చిన్నారిని బలి తీసుకున్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు నాగమణితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి భార్యతో గొడవ పడుతుండగా చిన్నారి భవిజ్ఞ(1) భయంతో ఏడ్చింది. అసహనానికి గురైన తండ్రి చిన్నారి కాళ్లు పట్టుకొని రెండుసార్లు నేలకేసి బాదాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించిగా.. చికిత్స పొందుతూ మరణించింది.