మెగా కుటుంబంలో మళ్లీ సంతోష వాతావరణం నెలకొంది. నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. చిరంజీవి కూడా సినిమా సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 2023 నవంబర్ 1న ఇటలీలో వివాహబంధంతో ఒక్కటైన వీరికి ఇది మొదటి సంతానం.