గాజాపై ఇజ్రాయెల్ మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీగా దాడులు ప్రారంభించింది. బందీలను రక్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఎత్తైన భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. గాజాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. ప్రస్తుతం హమాస్ చెరలో 48 మంది బందీలు ఉన్నారని అంచనా. గత వారం ఖతార్‌లో హమాస్ నేతలపై దాడుల్లో ఐదుగురు నేతలు, ఒక అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.