అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా మధ్య గొడవ జరిగిందా? అనే చర్చకు తెరలేపుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐక్యరాజ్యసమితి 80వ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ట్రంప్ దంపతులు అనంతరం మెరైన్ వన్ హెలికాప్టర్‌లో ప్రయాణించగా, ఆ సమయంలో ట్రంప్ మెలానియా వైపు వేలు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో వీరు తగువులాడుకున్నారంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. ఎస్కలేటర్ ఆగిపోవడంపై అసహనంతో ట్రంప్ చర్చించారని, గొడవేమీ కాదని లిప్ రీడర్లు వివరణ ఇచ్చారు.