సినీ కార్మికుల వేతనాల పెంపు.. ప్రకటించిన ఫిల్మ్‌ ఛాంబర్‌

తెలుగు సినిమా కార్మికుల వేతనాలు పెరిగాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించిన ప్రకారం కార్మిక శాఖ సమక్షంలో 13 సంఘాలు, నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వేతనాలు 22.5% పెంపు పొందాయి. జూనియర్ ఆర్టిస్టులకు 'ఏ' కేటగిరీకి రూ.1,420, 'బీ'కి రూ.1,175, 'సీ'కి రూ.930 వేతనం నిర్ణయించారు. అల్పాహారం ఇవ్వకుంటే రూ.70, భోజనం లేకుంటే రూ.100 అదనంగా చెల్లించాలి. కమిటీ ఏర్పడే వరకు ప్రతి ఒక్కరూ కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21 తేదీ నాటి మినిట్స్‌ను అనుసరించాలని నిర్మాతలకు సూచించారు.

సంబంధిత పోస్ట్