దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎట్టకేలకు భారత జట్టుకు తొలి వికెట్ దక్కింది. దీంతో పాక్ 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 9.4 ఓవర్‌కు ఫర్హాన్(57) తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఫర్హాన్ 35 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ స్కోర్ 84/1.