TG: సంగారెడ్ది జిల్లా ఆందోల్ లోని టపాసుల గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గోదాములో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్దంతో టపాసులు పేలుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.