ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంట్ రైల్వే స్టేషన్లోని పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.