TG: హైదరాబాద్‌లోని మణికొండలో కాల్పులు కలకలం రేపాయి. మాజీ మంత్రి KE ప్రభాకర్ తన అల్లుడు అభిషేక్ గౌడ్ పై అక్టోబర్ 25న గన్ తో బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అభిషేక్ గౌడ్ పై కేసు నమోదు అయింది. దీంతో ప్రభాకర్ మంగళవారం అభిషేక్ గౌడ్ ఇంటి దగ్గర కాల్పులు జరిపాడు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరిద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.