ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

AP: మొంథా తుపాను, ఎగువన కురిసిన వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీకి 4.22 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నదీతీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గింది. మున్నేరుకు కూడా వరద ప్రవాహం తగ్గుతోంది, ప్రస్తుతం 81 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాయంత్రానికి ఇది మరింత తగ్గుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్