ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరిలో అంతకంతకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 47.7 అడుగులకు చేరింది.  ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 10.01 లక్షల క్యూసెక్కులకు చేరిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. అల్లూరి, తూ.గో, ప.గో, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల ప్రజలను, అధికారులను అలర్ట్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్