ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11.75 అడుగులకి చేరితే మొదటి హెచ్చరిక, 13.75 అడుగులకి రెండో హెచ్చరిక, 17.75 అడుగులకి మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది.