తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ ఉద్యోగ విరమణ (వీడియో)

మగవాళ్లకి మాత్రమే సాధ్యం అనుకొన్న రంగంలో మూడు దశాబ్దాల క్రితమే అడుగుపెట్టి.. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్‌గా చరిత్ర సృష్టించిన సురేఖా యాదవ్ (మహారాష్ట్ర) ఉద్యోగ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకో పైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన తొలి మహిళా లోకో పైలట్‌గా నారీశక్తిని చాటి చరిత్ర సృష్టించారు.

సంబంధిత పోస్ట్