గోవా నుంచి సూరత్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం పైలట్ అనారోగ్యం కారణంగా ఆలస్యమైంది. దీంతో నిరుత్సాహపడిన ప్రయాణికుల్లో ఒకరు గర్బా ఆడేందుకే సూరత్ వెళ్తున్నానని చెప్పడంతో, ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులోనే స్పీకర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కలిసి గర్బా నృత్యం చేస్తూ కాలక్షేపం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రయాణికులు దీన్ని మరపురాని అనుభవంగా పేర్కొన్నారు.