TG: ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా మహోగ్రరూపం దాల్చింది. వరద తాకిడికి గర్భగుడి మండపం రేకులు కొట్టుకుపోయాయి. సింగూరు ప్రాజెక్టు నుండి 1లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మంజీరా నదికి వరద నీరు పోటెత్తింది. వరద తీవ్రతతో ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు కొట్టుకుపోయింది. ఇప్పటికే ఆలయానికి వెళ్లే మూడు దారులు మూసివేశారు. అమ్మవారి దర్శనానికి ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరించారు.