ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను మద్యం కుంభకోణం కేసులో ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. చైతన్య బఘేల్ దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం సిండికేట్‌ను నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. ఓ ఐఏఎస్ అధికారి సైతం వీరికి సహకరించినట్లు ఈడీ పేర్కొంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ తెలిపింది.