TG: చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో తాండూరు-హైదరాబాద్ రోడ్డు సమస్యలపై తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం, స్థానికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని యువత నిలదీశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు సమస్యలపై ఎందుకు దృష్టి సారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువత వెనక్కి తగ్గలేదు.