టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. ఆదివారం 70,310 మంది భక్తులు దర్శించుకోగా.. 21,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.